MLC Kavitha | తెలంగాణలో మతసామరస్యం కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ రావాలి : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | పదేండ్లుగా మతసామరస్యంతో వర్ధిల్లుతున్న తెలంగాణలో మళ్లీ ప్రశాంత వాతావరణం కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha) అన్నారు.
నిజామాబాద్ : పదేండ్లుగా మతసామరస్యంతో వర్ధిల్లుతున్న తెలంగాణలో మళ్లీ ప్రశాంత వాతావరణం కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha) అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ హయాంలో తరుచూ మతకల్లోలాలు(Riots ), కర్ఫ్యూల (Curfews) తో భయంకరమైన పరిస్థితి ఉండేదని, సీఎం కేసీఆర్(CM KCR) అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి ఘటనలు పునరావృతం కాలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని, దేవాలయాలు, మసీదులు, చర్చిలకు, గురుద్వారలకు ఖజానా నుంచి డబ్బులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఏ ఒక్క మతం పట్ల వివక్ష చూపకుండా పరిపాలించామని స్పష్టం చేశారు.
ముస్లింలకు నిజమైన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని, ముస్లి్ సమాజాన్ని ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ కాదని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మతకల్లోలాలు జరుగుతున్నాయని వెల్లడించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అహ్మద్ , బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

