Congress | కామారెడ్డి : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపునకు కృషి చేస్తానని, సర్పంచ్ నుంచి మొదలుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికలల్లో అధిక సంఖ్యలో పార్టీ అభ్యర్థులు గెలపించేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
కామారెడ్డి ప్రాంతం అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ ల దృష్టికి తీసుకెళ్తానని, కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి నిధులు తీసుకొచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్ పాత శివకుమార్, అన్వర్, నాయకులు ఉరుదొండ రవి, సలీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.