నస్రుల్లాబాద్ : కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం అన్నారం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైన ( House burnt ) ఘటన శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. అన్నారం గ్రామానికి చెందిన అంజవ్వ అనే మహిళ రేకుల ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ( Short Circuit ) తో మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న వంట సామాను, నిత్యవసర వస్తువులు, బట్టలు కాలి బూడిదయ్యాయి. అప్రమత్తమైన అంజవ్వ తన కుటుంబ సభ్యులతో బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. స్థానికులు చేరుకుని మంటలు ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు పేర్కొన్నారు.