కోటగిరి / రుద్రూర్/ వర్ని / నస్రుల్లాబాద్ / బీర్కూర్ : హోలీ సంబరాలను (Holi celebrations ) నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ హోలీని ఉత్సాహంగా జరుపుకున్నారు. నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా కోటగిరిలో మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ఆధ్వర్యంలో యువకులు బ్యాండ్ మేళాలతో డ్యాన్స్ చేస్తూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
రుద్రూర్ ,వర్ని మండలాల్లో ..
రుద్రూర్ ,వర్ని మండలాల్లో పలు గ్రామాల్లో ఘనంగా హోలీ వేడుకలను నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంతోపాటు చిక్కడపల్లి, రుద్రూర్, సులేమాన్ నగర్‌తో పాటు పలు గ్రామాల్లో హోలీ వేడుకలు నిర్వహించారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకున్నారు. కార్యక్రమంలో నాయకులు పత్తి రాము , మాజీ సర్పంచ్ శేఖర్, మహీందర్, మారుతీ, మురళీ, శేఖర్, కార్తీక్, నరేష్, కృష్ణ, రాజు, ప్రవీణ్, మహేష్, చరణ్ తదితరులు ఉన్నారు.
నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో ..
నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో శుక్రవారం ఆయా గ్రామాల ప్రజలు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో కాలనీవాసులు హోలీ పండుగను నిర్వహించారు. బీర్కూర్ మండల కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద హోలీ పండుగ సందర్భంగా 50 కేజీల గుండు రాయిని ఎత్తుకొని ఔరా అనిపించాడు.