చందూర్ : చందూర్ మండల కేంద్రంలో హోలీ పండుగ సంబురాలు జరిగాయి. ఈ సందర్భంగా కరేగామ్ తండాలోని బంజారాలు లేంగీ నృత్యం చేశారు. ఈ నృత్యం చూపరులను అలరించింది. గ్రామాల్లో సార్గమ్మ ఉండటంతో హోలీ పండగ సందర్బంగా ఒకరోజు ముందు సంబురాలు జరుపుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు. బుధవారం కాముడు కాలుస్తున్నట్టు చెప్పారు.
ఈ హోలీ ఉత్సవాల్లో కరేగామ్ మాజీ సర్పంచ్ దేవి సింగ్, చందూర్ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, తండా వాసులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.