చందూరు: నిజామాబాద్ జిల్లాలోని చందూరులో ఒక రోజు ముందే ప్రజలు హోలీ (Holi) వేడుకలు జరుపుకున్నారు. గ్రామంలో సాగమ్మ ఉండడంతో ముందుగానే హోలీ పండుగను నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కామ దహనం, కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పటాకులు కాల్చి, కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కవిత నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చందూరు మండల మాజీ సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి, పార్టీ నాయకులు మాముల శ్రీను, శివన్నారాయణ, డాన్స్ శేఖర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.