నిజామాబాద్ స్పోర్ట్స్/శక్కర్‌నగర్, నవంబర్ 15: బోధన్‌తోపాటు నిజామాబాద్ నగరంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు అశేష జనవాహిని తరలివచ్చింది. కళాకారుల బృదం ఆటాపాటలు ఆలోచింపజేశాయి. నగరంలోని సభలో కేసీఆర్, కేటీఆర్, కవిత కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళా ప్రజాప్రతినిధులు, నాయకురాళ్లు ‘గులాబీల జెండలమ్మా..’ పాటకు డ్యాన్సులతో సందడి చేశారు.
1.20 గంటలకు : హెలికాప్టర్లో బోధన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. ప్రత్యేక బస్సులో సభా వేదికపైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. ఆయనకు బోధన్ ఎమ్మెల్యే షకీల్, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు పూదోట రవికిరణ్ స్వాగతం పలికారు.
1.30: ఎమ్మెల్యే షకీల్ ప్రసంగం అనంతరం సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
1.59: తెలుగు, ఉర్దూలో 29 నిమిషాలపాటు మాట్లాడిన ముఖ్యమంత్రి.. తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం హెలికాప్టర్లో నిజామాబాద్ అర్బన్ సభకు బయల్దేరి వెళ్లారు.
1.40: ప్లకార్డులు, గులాబీ జెండాలు, కండువాలతో వచ్చిన జనంతో నిజామాబాద్ అర్బన్ ఆశీర్వాద సభ పూర్తిగా నిండిపోయింది.
2.14: హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు.
2.18: సీఎం కేసీఆర్‌కు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మహేశ్ బిగాల తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం బస్సులో సభా ప్రాంగణానికి బయలుదేరారు.
2.20: సభా వేదిక వద్దకు గులాబీ బాస్ కేసీఆర్ చేరుకున్నారు.
2.23: ప్రజలకు సీఎం కేసీఆర్ అభివాదం చేయడంతో జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.
2.24: వేదికపై అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడారు.
2.28: ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు. ముస్లింలకు కూడా అర్థమయ్యేలా ఉర్దూలోనూ మాట్లాడారు.
2.56: జై తెలంగాణ నినాదంతో బీఆర్ఎస్ అధినేత తన ప్రసంగాన్ని ముగించగా, మొత్తం 28 నిమిషాలు వేదికపై మాట్లాడారు.
3.02: హెలికాప్టర్లో ఎల్లారెడ్డి సభకు బయల్దేరారు.