Kamareddy | కామారెడ్డి : కామారెడ్డిలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. కామారెడ్డి పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగుపారుతోంది. జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో నీరు పలు ఇండ్లలోకి చేరింది. సుభాష్ రోడ్ లో నీటి ప్రవాహంలో 45 మందితో ఉన్న బస్సు చిక్కుకోవడంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 18 శాతం వర్షపాతం నమోదైంది. పరిస్థితిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. నీటిమట్టంపై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.