భిక్కనూరు, మే 28: ఉపాధి హామీ పనులు చేస్తుండగా గుండెపోటుతో కూలీ మృతి చెం దిన ఘటన భిక్కనూరు మండల కేంద్రం లో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన అంబల్ల మల్ల య్య (66) భిక్కనూరు కర్లోని కుంటలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు ఉద యం వెళ్లాడు. ఎప్పటిలాగే తోటి కూలీలతో కలిసి పనిచేస్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పిరావడంతో అక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు, ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి కలిసి మల్లయ్యను కామారెడ్డి దవాఖానకు తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. మల్లయ్య మృతదేహాన్ని ఎంపీడీవో, ఏపీవో పరిశీలించారు.