ఖలీల్‌వాడి, అక్టోబర్ 4: పర్యావరణా న్ని కాపాడేందుకు ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. నిజామాబాద్ బస్టాండ్‌లో ఎలక్ట్రికల్ బస్సులను ఆయన శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రికల్ బస్సులను నిజామాబాద్-జేబీఎస్, బాన్సువాడ-నిజామాబాద్ మధ్య నడుపనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, భూపతిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, నగర మేయర్ దండు నీతూకిరణ్, అడిషనల్ కలెక్టర్ అంకిత్, డీటీసీ దుర్గాప్రమీల, రీజినల్ మేనేజర్ జానిరెడ్డి పాల్గొన్నారు.