మోర్తాడ్/ఆర్మూర్‌టౌన్/వినాయక్‌నగర్/కంఠేశ్వర్, మార్చి 29: జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
విశ్వావసు నామ సంవత్సరంలో అంతా మంచే జరగాలని, ప్రజలందరి జీవితాల్లో ఆశలు చిగురించాలని, ప్రకృతి కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతులతో పాటు అన్ని రంగాల్లో ప్రజలు అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ సాయి చైతన్య జిల్లావాసులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, పండుగను ప్రజలంతా ఐక్యతతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.