పోతంగల్ : నిజామాబాద్ (Nizamabad) జిల్లా పోతంగల్ మండలములోని కారెగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు (Students) 20 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకచోటే కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నాడు చదువుచెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. నాటి అధ్యాపకులు గణేష్ బాబూ, సలీం, తోఫిక్ అహ్మద్, బాబూను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రావణ్, రాజు, రసూల్, రమేష్ తదితరులు ఉన్నారు.