నిజాంసాగర్, ఆగస్టు 17: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జుక్కల్ నియోజకవర్గంలో మంగళవారం (నేడు) చేపట్టనున్న ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ అన్ని మండల కేంద్రా ల్లో ధర్నా నిర్వహించాలని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సూచించారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.