పెద్ద కొడప్గల్ (పిట్లం), ఏప్రిల్ 3: ప్రభుత్వం జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. గురువారం ఆయన పిట్లం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షాలకు జొన్న రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని తెలిపా రు.
రైతులు పండించిన సోయాబీన్, కంది, మక్కజొన్న, పత్తి, జొన్న పంట ప్రతి గింజనూ కొనుగోలు చేసిన ప్రభుత్వం కేవలం ఒక్క కేసీఆర్ ప్రభుత్వమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యా యం చేస్తున్నదని మండిపడ్డారు. జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో జొన్న పంటను ఎక్కువగా పండిస్తారని తెలిపారు. ఈ ఏడాది జొన్నల కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించాలని రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేలా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.