కంఠేశ్వర్/ కామారెడ్డి, నవంబర్ 18: ఉమ్మడి జిల్లాలో రెండురోజులుగా నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సోమవారం తనిఖీ చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలను నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.
నిజామాబాద్‌లో సోమవారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 19,941 మంది అభ్యర్థులకు 9,880 (49.54 శాతం) మంది హాజరు కాగా 10,058 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. కామారెడ్డిలోని 20 పరీక్షా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 8,268 మంది అభ్యర్థులకు 4,612 మంది (55.78 శాతం) హాజరు కాగా 3,656 మంది గైర్హాజరయ్యారని రీజినల్ కో-ఆర్డినేటర్ విజయ్ కుమార్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.