కంఠేశ్వర్, మే 31 : జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అధికారులకు సూచించారు. టీఎస్పీఎస్సీ నిబంధనలకు అనుగునంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో 12,833 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం 41 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సూచించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్థులను ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్త రామ్మోహన్రావు, డీఈవో దుర్గాప్రసాద్, ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.