Accident | రాజంపేట : రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన తాతా మనవడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బస్వన్నపల్లి గ్రామానికి చెందిన దోమకొండ రాములు (50) తన మనవడు శ్రీహాస్ (4) రాజంపేట మండలం కేంద్రంలోని హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం రాజంపేటకు వెళ్లారు.
చికిత్స అనంతరం తిరిగి బసవన్నపల్లి వైపు వస్తుండగా పెద్దయిపల్లి గేటు వద్ద గుండారం నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో వారిద్దరూ బస్సు చక్రాల కింద పడడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారిద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్ ను శిక్షించాలని, కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.