జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న వేణుమాల్లో నమస్తే తెలంగాణ , తెలంగాణ టుడే ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా హాజరై ప్రాపర్టీ షోను ప్రారంభించారు. ప్రదర్శనలో 22 ప్రముఖ రియల్ ఎస్టేట్, గృహనిర్మాణ సంస్థల స్టాళ్లు కొలువుదీరాయి. పెద్ద సంఖ్యలో జిల్లావాసులు తరలివచ్చి స్టాళ్లను సందర్శించారు. వివిధ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాలు, వెంచర్లు, విల్లాలు, అపార్ట్మెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఖలీల్‌వాడి, మార్చి 8: నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని వేణు మాల్లో శనివారం ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో సూపర్ సక్సెస్ అయ్యింది. రెండ్రోజుల పాటు సాగే ఈ ప్రదర్శనకు తొలిరోజు విశేష స్పందన లభించింది. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగల గణేశ్‌గుప్తా ప్రాపర్టీ షోను లాంఛనంగా ప్రారంభించారు. జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మాజీ మేయర్ నీతూకిరణ్ తదితరులు పాల్గొన్నారు. స్థిరాస్తి ప్రదర్శనలో కొలువుదీరిన 22 స్టాల్స్‌ను పరిశీలించి, వారు చేపట్టిన ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాపర్టీ షోకు జిల్లా వాసులు భారీగా తరలివచ్చారు. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాల గురించి, బ్యాంకు రుణాల గురించి ఆరా తీశారు.
కొనుగోలుదారులను, రియల్టర్లు, బిల్డర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే చొరవ తీసుకోవడం అభినందనీయమని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రాపర్టీ షోను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నమస్తే తెలంగాణ బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టిందని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రియల్టర్లు, బిల్డర్లు, కొనుగోలుదారులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ప్రాపర్టీ షో నిర్వహించడం బాగుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగం కష్టకాలంలో ఉన్న ప్రస్తుత సమయంలో ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ‘నమస్తే తెలంగాణ’ కృషి చేస్తుండడం అభినందనీయమన్నారు.
ఈ ప్రదర్శన కొనుగోలుదారులకు, స్థిరాస్తి వ్యాపారులకు మంచి అవకాశమని చెప్పారు. ఓపెన్ ప్లాట్లతో పాటు ఫ్లాట్స్, విల్లాల వివరాలు తెలుసుకోవచ్చని, బ్యాంకు రుణాల గురించి కూడా తెలుసుకునే అవకాశముందన్నారు. అన్ని అనుమతులు ఉన్న సంస్థలనే నిర్వాహకులు ఈ వేదికపైకి తీసుకొచ్చారని, తద్వారా ప్రజలు మోసపోయే అవకాశం లేకుండా చేశారని ప్రశంసించారు. ఎలాంటి అనుమానాలు లేకుండా తమకు నచ్చిన ప్లాట్లు, ఫ్లాట్లు కొనుక్కునే అవకాశం ఉందన్నారు. రియల్టర్లు, బిల్డర్లు మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకుని సరసమైన ధరలు నిర్ణయించాలని సూచించారు. అలా చేస్తే ఆయా ప్రాజెక్టులు విజయవంతమవుతాయన్నారు. ఇలాంటి ప్రాపర్టీ షోలు నిర్వహించడం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకే సాధ్యమని ప్రశంసించారు.
నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ప్రతి సంవత్సరం ఆటో షో, ప్రాపర్టీ షో నిర్వహిస్తూ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. ప్రస్తుతం ఎండలను దృష్టిలో ఉంచుకుని ఏసీలో, ఆహ్లాదకర వాతావరణంలో ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం బాగుందన్నారు. నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొనడం అభినందనీయమని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు.
నాణ్యమైన సేవలు అందించే సంస్థలను నిర్వాహకులు ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నిర్వహిస్తున్న ఈ షో ద్వారా భర్తలు తమ భార్యలకు, అన్నలు తమ చెల్లెళ్లకు అద్భుమైన గిఫ్ట్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా వెంచర్లు, విల్లాలు, అపార్ట్మెంట్స్, సోలార్ కంపెనీలతో పాటు బ్యాంకులను సైతం ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. పైగా ప్రజలు మోసపోకుండా అన్ని అనుమతులు ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ ప్రదర్శనలో అనుమతించారని తెలిపారు.
ఇండ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రజల సౌలభ్యం కోసమే నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నదని అడ్వైర్టెజ్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్ ఎన్.సురేందర్‌రావు తెలిపారు. నిజామాబాద్‌తో పాటు కరీంనగర్లో ప్రాపర్టీ షో, వరంగల్‌లో ఆటో షో నిర్వహిస్తున్నామన్నారు. డీసీసీబీ డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నాయకులు సత్యప్రకాశ్, తెలంగాణ శంకర్, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ ధర్మరాజు, ఎడిషన్ ఇన్చార్జి లక్మ రమేశ్, బ్యూరో ఇన్చార్జి జూపల్లి రమేశ్‌రావు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
కంఠేశ్వర్ , మార్చి 8 : 30 ఏండ్ల నుంచి వాసవి గ్రూప్ కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా సేవలందించడంలో ముందుంటున్నది. కొంపల్లిలో 2బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే రెసిడెన్సియల్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు ఫ్రీ ఈఎంఐ ఆఫర్స్, లోన్స్ సదుపాయం అందుబాటులో ఉన్నది.
-సాయినాథ్, డిప్యూటీ మేనేజర్, వాసవి గ్రూప్
జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్కు సమీపంలో జీ+1 అనుమతులతో 104 గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు నిర్మించాం. ఫస్ట్ ప్రీమియం ప్రాజెక్టు విల్లాలు జిల్లాలో తక్కువ ధరలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
-గణేశ్, సేల్స్ సూపర్వైజర్, ఎస్వీసీ కన్స్ట్రక్షన్స్
అరవింద్ బాలాజీ డివైన్ 30 ఏండ్ల నుంచి కస్టమర్లకు సేవలందిస్తున్నది. ఇప్పటివరకు బెంగళూరులో ఏడు ప్రాజెక్టులను పూర్తిచేశాం. హైదరాబాద్‌లో 1.5 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ 122 ఫ్లాట్స్, ఎల్బీనగర్ హోదా కమర్షియల్ మల్టీఫ్లెక్స్, విల్లాస్ లోన్ సదుపాయంతో (రెడీ టు మూవ్) అందుబాటులో ఉన్నాయి.
-అనిల్‌రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్, అరవింద్ బాలాజీ డివైన్
శ్రీ గోవింద సాయి డెవలపర్స్ నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం వద్ద హైవేకు దగ్గరగా అందుబాటులో నుడా, రెరా అనుమతులతో ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు లోన్‌తో పాటు ఈఎంఐ అవకాశం కూడా అందుబాటులో ఉన్నది.
-ప్రవీణ్‌గౌడ్, సీఈవో, శ్రీ గోవింద సాయి డెవలపర్స్
అశోకా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ 20 ఏండ్ల నుంచి నిజామాబాద్‌లో ప్రజలకు సేవలందిస్తున్నది. అది తక్కువ ధరలో అపార్ట్మెంట్లు, విల్లాలు ప్రీమియం లోకేషన్లో గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలతో ప్రజలకు అందుబాటు ధరలో ఉన్నాయి.
-సునీల్‌రెడ్డి, మేనేజర్, అశోకా బిల్డర్స్ అండ్ డెవలపర్స్
ఏపీడీ డెవలపర్స్ 20 ఏండ్ల నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉన్నది. ఇప్పటివరకు 44 వెంచర్లు పూర్తి చేసి కస్టమర్ల వద్ద నమ్మకమైన డెవలపర్స్‌గా పేరు పొందింది. మాసాయిపేట్, నిజామాబాద్, హైదరాబాద్ హైవేలో డీటీసీపీ అన్ని రకాల అనుమతులతో ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
-బిజు దత్తాద్రి, ఎండీ, ఏపీడీ డెవలపర్స్
ఆదూరి గ్రూప్ 20 ఏండ్ల నుంచి కస్టమర్లకు సేవలందిస్తూ ఇప్పటివరకు దాదాపుగా 50 ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. హెచ్ఎండీఏ, రెరా ఫార్మ్ ల్యాండ్ పూర్తి అనుమతులతో ఆర్ఆర్ఆర్కు 500 మీటర్ల దూరంలో హెల్త్ విలేజ్, డ్రీమ్ వ్యాలీ మూడు అందుబాటులో ఉన్నాయి. ప్రాపర్టీ షోలో స్లాట్ బుక్ చేసుకుంటే 10 గ్రాముల గోల్డ్ బహుమతిగా ఇస్తున్నాం.
-శ్రీనివాస్, మేనేజర్, ఆదూరి గ్రూప్
మా వద్ద కొత్త ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు అందుబాటు ధరల్లో ఇంటర్నేషనల్ ఫర్నిచర్ అందుబాటులో ఉంది. ఇండియన్ నంబర్ వన్ బ్రాండ్‌తోపాటు నాలుగు దేశాలకు సంబంధించిన ఫర్నిచర్ అందుబాటులో ఉన్నది.
-మహేశ్, మేనేజర్, రాయల్ ఓక్ ఫర్నిచర్
నార్త్ క్రెస్ట్ కొంపల్లి హైవే నుంచి కిలోమీటర్ దూరంలో క్రెడిట్ ఆక్యూపై విల్లాలు అందుబాటులో ఉన్నాయి. కొంపల్లి హైవే పక్కన 10 ఫ్లోర్ ప్రీమియం అపార్ట్మెంట్స్ కేవలం 3 బీహెచ్‌కె పూర్తిగా రెడ్ బ్రిస్క్ కన్స్రక్షన్తో అన్ని సదుపాయాలతో అందుబాటులో ఉన్నాయి. నార్త్క్రెస్ట్ పదేండ్ల నుంచి కస్టమర్లకు మెరుగైన సేవలందిస్తున్నది.
-పవన్ ప్రసాద్, సేల్స్‌హెడ్, నార్త్ క్రెస్ట్
మకుట డెవలపర్స్ 20 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవలందిస్తున్నది. కొంపల్లిలో ఆల్ట్రా లగ్జరీ ప్రాజెక్టు జీ+16 ఫ్లోర్స్‌తో 64 ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. గ్లాస్‌వాల్ స్ట్రక్చర్‌తో ఫస్ట్ట్ టైం నిర్మించాం. కొంపల్లిలో మంజీర, బోరువాటర్ సౌకర్యం ఉన్నది. ప్రజలకు అందుబాటు ధరల్లో ఉన్నాయి.
-శాంతన్‌కుమార్, సేల్స్‌హెడ్, మకుట డెవలపర్స్
భూమి స్పేస్ 2013 నుంచి ఇప్పటివరకు దాదాపు 18 ప్రాజెక్టులు చేపట్టింది. నేషనల్ హైవే 44వ వెంబడి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. నార్సింగి నుంచి మనోహరాబాద్ నేషనల్ హైవే వెంబడి హెచ్ఎండీఏ, డీటీసీపీ, రేరా అనుమతులతో ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. భూమి స్పేస్ ఇప్పటివరకు ఆరువేలకుపైగా హ్యాపీ కస్టమర్ ఫ్యామిలీని కలిగి ఉంది.
-పులి అర్జున్‌రావు, ఫౌండర్ అండ్ డైరెక్టర్, భూమి స్పేస్
మైరా సుపీరియర్ లివింగ్ 14 ఏండ్ల నుంచి కొంపల్లిలో కస్టమర్లకు సేవలు అందిస్తున్నది.
గేటెడ్ కమ్యూనిటీ అనుభూతితో అపార్ట్మెంట్, ప్లాట్స్ ప్రధాన రహదారి నుంచి కిలోమీటర్లోపు అందుబాటులో ఉన్నాయి. జీ+5 అనుమతితో రెడ్ బ్రిస్క్ ఉపయోగించి హెచ్ఎండీ, రేరా అనుమతులతో 55 శాతం ఓపెన్‌ప్లాట్లు 3.6 ఎకరాల్లో అందుబాటులో ఉన్నాయి.
-మోహన్‌చారి, మేనేజర్, మైరా సుపీరియర్ లివింగ్
సన్యుగ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 23 ఏండ్ల నుంచి కస్టమర్లకు సేవలందిస్తున్నది. హైటెక్ సిటీ, మణికొండ, కొంపల్లిలో ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, కోంపల్లిలో ప్రీమియర్ విల్లాస్, మేడ్చల్‌లో ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
-జనార్దన్, మేనేజర్, సన్యుగ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్
శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ 2018 నుంచి ఇప్పటివరకు 23 ప్రాజెక్టులను పూర్తిచేసింది. ప్రస్తుతం తొమ్మిది ప్రాజెక్టుల కస్టమర్లను కలిగి ఉన్నది. నేషనల్ హైవే వెంబడి గజానికి రూ.5.500 నుంచి రూ. 36వేల వరకు అన్ని అనుమతులతో ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. లోన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
-షేక్ అహ్మద్,జనరల్ మేనేజర్, శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్
ఐశ్వర్య హోమ్స్ ఎనిమిదేండ్లుగా నిజామాబాద్‌లో కస్టమర్లకు సేవలందిస్తున్నది. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు, నేషనల్ మార్ట్ దగ్గర 27 విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్ సదుపాయాలతో (రెడీ టు ఆక్యుపై) అందుబాటులో ఉన్నాయి. రుణ సదుపాయం కూడా ఉన్నది.
-మధు, ఎండీ, ఐశ్వర్య హోమ్స్