పెద్ద కొడప్గల్ : కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో శనివారం హనుమాన్ దేవాలయ ఆవరణలో 17వ అఖండ హరినామ సప్తహాం (Akhanda Harinama Saptaham ) ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా విఠల్ మహారాజ్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా కాటేపల్లి (Katepally) గ్రామంలో సప్తహాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సప్తహా కార్యక్రమం వచ్చే నెల 1వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రతిరోజు కాకడ హారతి, గాథ భజన, హరిపాట్ ,కీర్తన, భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.