పోతంగల్ అక్టోబర్ 16: నమస్తే తెలంగాణ కథనానికి అధికారులు స్పందించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గ (యం) గ్రామంలో ఆనవాళ్లు కోల్పోయి అపరిశుభ్రంగా మారిన మురుకి కాలువలు అనే శీర్షిక సోమవారం ప్రచురితం అయ్యింది. కాలువలు నిర్మించి రెండేళ్లు గడుస్తున్న ఒక్కసారి కూడా మురుగు కాలువలు తీయలేదనీ వార్త ప్రచురితం కాగా స్పందించిన పంచాయతీ అధికారులు గురువారం పారిశుధ్య కార్మికులతో పిచ్చి మొక్కలను తొలగించి మురికి కాలువలను శుభ్రం చేయించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జీపీ సిబ్బంది తిరుపతి తదితరులున్నారు.