NIZAMABAD | నస్రుల్లాబాద్ ఏప్రిల్ 2: రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గమ్మ శ్యామల అన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏ-గ్రేడు రకానికి రూ.2320, బి-గ్రేడ్ రకానికి రూ.2300 మద్దతు ధర ఇస్తుందన్నారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దని ఆమె సూచించారు. అనంతరం చౌక ధరల దుకాణంలో లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని ఆమెను పంపిణీ చేశారు. నస్రుల్లాబాద్, హాజీపూర్ గ్రామాల్లో నసురుల్లాబాద్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సహకార సంఘం అధ్యక్షుడు గంగారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్, తహల్దార్ ప్రవీణ్ కుమార్, మైలారం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు హనుమంతరావు, నాయకులు జగన్ భాస్కర్, మహేందర్ గౌడ్ చంద్ర గౌడ్, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.