కమ్మర్పల్లి, అక్టోబర్30: రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా సహకార అధికారి సింహాచలం కోరారు. సోమవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ.2,203, ‘బీ’ గ్రేడ్ (కామన్ రకం) ధాన్యానికి రూ.2,183 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రేగుంట దేవేందర్, తహసీల్దార్ భాస్కర్, మండల వ్యవసాయాధికారిణి లావణ్య, ఏఈవో కావ్య, పీఏసీఎస్ సెక్రటరీ శంకర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఏర్గట్ల, అక్టోబర్ 30: మండల కేంద్రంలోని సొసైటీ వద్ద మండల వ్యవసాయధికారి మహ్మద్ అబ్దుల్ మాలిక్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రానికి పట్టాపాస్‌బుక్, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలను తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో స్నేహ, సీఈవో శ్రీనివాస్, సహకార సంఘం సిబ్బంది సతీశ్ గౌడ్, సాయి బాబా, సాయిపవన్, తదితరులు పాల్గొన్నారు.
బోధన్ రూరల్, అక్టోబర్ 30: సాలూర మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం, సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని బోధన్ వ్యవసాయ శాఖ అధికారి సంతోష్‌నాయక్, సొసైటీ కార్యదర్శి బస్వంత్రావుపటేల్తో కలిసి ప్రారంభించారు. సోయాబీన్ క్వింటాలుకు రూ.4600 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో అపర్ణ, సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు.
నవీపేట, అక్టోబర్ 30: మండలంలోని నాళేశ్వర్, బినోలా, జన్నేపల్లి, మోకన్‌పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్ మోహన్ ప్రారంభించారు. కార్యక్రమంలో సీఈవో మేకల రమేశ్, మోకన్‌పల్లి మాజీ ఎంపీటీసీ దూడల బాల్‌రాజ్‌గౌడ్ పాల్గొన్నారు.
రెంజల్, అక్టోబర్ 30: స్థానిక సహకార సంఘం పరిధిలోని రెంజల్, బోర్గాం, తాడ్‌బిలోలి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ సీఈవో రాముగౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఈవో ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎడపల్లి, అక్టోబర్ 30: మండల కేంద్రంలో ఐకేపీ, సొసైటీ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఏపీఎం సాయిలు, సొసైటీ సిబ్బంది ప్రారంభించారు. మట్టి, తాలు లేకుండా శుభ్రం చేసి ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరారు.
జక్రాన్‌పల్లి, అక్టోబర్ 30 : జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ సీఈవో తిరుపతిరెడ్డి ప్రారంభించారు.
ఇందల్వాయి, అక్టోబర్ 30 : ఇందల్వాయి మండలం చాంద్రాయాన్పల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ఏఈవో ప్రకాశ్‌గౌడ్ ప్రారంభిచారు. సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.