రెంజల్ : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామం చారిత్రాత్మక కేంద్రంగా విరాజిల్లుతుందని త్రిపుర గవర్నర్ (Tripura Governor ) ఇంద్రసేనా రెడ్డి (Indrasena Reddy) అన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ బాలిరామ్ హెగ్డేవార్ (Keshav Baliram Hedgewar ) జన్మించిన కందకుర్తి గ్రామంలో నిర్మాణంలో ఉన్న స్మృతి మందిరం పనులను గవర్నర్ పరిశీలించారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 2025 దసరా నాటికి వంద సంవత్సరాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా స్మృతి మందిరం పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.