ధర్పల్లి, జూన్ 12: ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి మెరుగైన విద్య, ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. బడిబాటలో భాగంగా ధర్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్డును ఆయన బుధవారం ప్రారంభించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లాంటి గొప్ప వ్యక్తులెందరో ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని, ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులు, సుశిక్షితులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన
ఉంటుందని, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు. ఈ సందర్భంగా హెచ్ఎం, గ్రామస్తులు పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులపై ఎమ్మెల్యేను కోరగా సానుకూలంగా స్పందించారు. ప్రహరీ నిర్మాణం, ఆర్వో ప్లాంటు, స్కావెంజర్, వాచ్మెన్ల నియామకానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారికాహన్మంత్‌రెడ్డి, ఎంపీడీవో బాలకృష్ణ, ఎంపీవో రాజేశ్, నాయకులు పాల్గొన్నారు.