ఖలీల్వాడి, జనవరి 6: సంక్రాంతి పండుగకు ప్రభుత్వం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనున్న ది. దూర ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వెళ్లే ప్రయాణికుల కోసం 444 ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోత్స్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు, 16 నుంచి 20వ తేదీన వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.