ఆర్మూర్ : ఆర్మూర్ (Armour) పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డీఎంహెచ్వో జయశ్రీ (DMHO Jayashree) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఆసుపత్రిలో వైద్యం ఎలా అందుతుందని రోగులకు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు ఎప్పటికప్పుడు ఆసుపత్రి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.