వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామశివారులో గురువారం గూడ్స్ రైలు ఢీ కొనడంతో 50 గొర్రెలు మృతి చెందాయి. కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న రైలు మార్గమద్యలో అంక్సాపూర్ గ్రామశివారులో రైలు పట్టాలపై ఉన్న గొర్రెలను ఢీ కొట్టింది. దీంతో 50 గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందగా మరికొన్ని గొర్రెలు గాయపడ్డాయి.
ఈ సంఘటనలో సుమారు రూ.5లక్షల వరకు నష్టం జరిగిందని గొర్రెల యజమాని భోజన్న, అతడి కుమారుడు చిన్న భోజేందర్ తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు.