Godaavari River | రెంజల్, ఆగస్టు 16 : రేంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు వాగులు. వంకలు పొంగి ప్రవహిస్తున్న వరద తెలంగాణ లోని కంద కుర్తి వద్ద మూడు నదులైనా హరిద్ర .మంజీరా గోదావరి నదిలోకి చేరుకుంటుంది. గోదావరి నదిపై నిర్మించిన అంతరాష్ట్ర వంతెన కు అనుకొని వరద నీటి ప్రభావం కొనసాగుతుంది. నదిలోని పురాతన శివాలయం శిఖరం మాత్రమే సందర్శకులకు దర్శనమిస్తుంది.