Gamblers Arrested | పోతంగల్ జనవరి14: పేకాట ఆడుతున్న ఏడుగురిని మంగళవారం రాత్రి అదుపులో తీసుకున్నట్లు కోటగిరి పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూర్ గ్రామ శివారులో రాత్రి సమయంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారమందింది.
ఈ మేరకు పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేసి పట్టుకున్నాం. వారి వద్ద నుండి రూ.7,920 స్వాధీనం చేసుకుని ఏడుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు.