కామారెడ్డి,మే 15: కాళేశ్వరం ప్యాకేజీ 22 కెనాల్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.23.15 కోట్ల నిధులు మంజూరు చేసిందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ సీఈవో శ్రీనివాస్, ఎల్లారెడ్డి ఈఈ మల్లేశ్‌తో కలిసి భూ సేకరణ పనులపై గురువారం చర్చించారు. కెనాల్ పనుల కోసం 316 ఎకరాలకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
మరో 97 ఎకరాలు అవార్డ్ స్టేజీలో ఉన్నాయని, రైతులకు డబ్బులు చెల్లించాలని కలెక్టర్‌ను అధికారులు కోరారు. 203 ఎకరాలు రికార్డు స్టేజీలోనే ఉన్నందున.. వాటిని అవార్డు స్టేజీకి తీసుకెళ్లాలని ఆర్డీవోకు సూచిస్తూ, భూ సేకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.