Isrojiwadi | కామారెడ్డి రూరల్, డిసెంబర్ 31 : ఇస్రోజీవాడి గ్రామంలో చిన్నారుల విద్యాభివృద్ధికి బాటలు వేస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైమరీ పాఠశాలను ఆ గ్రామ సర్పంచ్ చిందం మల్లేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలో తొలిసారిగా చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఫ్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చిందం మల్లేష్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించాలని ఉద్దేశంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేశామని, కావున తల్లిదండ్రులు, విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిద్ధం స్వామి, విద్యా కమిటీ చైర్మన్ కవిత వార్డు సభ్యులు సిద్ధం స్వామి, షేక్ అజీజ్, లోకోటి మోహన్ రావు, దుబ్బాక సంతోష్, కనకంటి లక్ష్మి, కొత్త బాలమణి, కొప్పల సాయవ్వ, మాధవి, నవీన్, చేటుకూరి ప్రణీత్ పాల్గొన్నారు. కాగా ఉపాధ్యాయులు రంజిత, మౌనిక, జ్యోతి, ఆయమ్మ, సావిత్రి ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది గ్రామ పాలకవర్గం సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు.