Free medical camp | పోతంగల్ జూన్ 9 : మండలంలోని హంగర్గ బీసీ కాలనీ ఆబాదిలో బుధవారం మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. హాస్పిటల్ ఎంబీబీఎస్ డాక్టర్లు అఖిల్, ఇర్ఫాన్ ఉద్దీన్ సుమారు 100మంది తో పాటు పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉదయ్ భాస్కర్, ఎంఈవో శంకర్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, అశోక్, సురేశ్, అబ్బయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.