బీబీపేట, దోమకొండ : కామారెడ్డి ( Kamareddy ) జిల్లాలో దోమకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి సంతకాలను ఫోర్జరీ ( Forgery ) చేసిన కేసులో నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై స్రవంతి తెలిపారు. దోమకొండకు చెందిన చింతల రవీందర్ , శ్యామ్రెడ్డి , మంగళపల్లి శ్రావణ్, రబ్బర్ స్టాంప్లు తయారు చేసే కామారెడ్డికి చెందిన దొంతుల కృష్ణను అరెస్టు చేసినట్లు వివరించారు. వీరి వద్ద రశీదు బుక్కులు , నకిలీ స్టాంపులు, రౌండ్ సీల్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కోర్టు కేసుల్లో నకిలీ షూరిటీల కోసం అవసరమయ్యే పత్రాలపై కార్యదర్శి సంతకాలు ఫోర్జరీ చేసి, స్టాంపులు, సీళ్లు వాడినందుకు వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.