Varahi Ammavari Temple | నిజామాబాద్ ఖలీల్ వాడి: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అమ్మ వెంచర్లో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వారాహి అమ్మవారి ఆలయం కొలువు దీరనున్నది. ఈ ఆలయ నిర్మాణానికి ఈ నెల 10న శంకుస్థాపన చేపట్టినట్లు వారాహి మాతా ఆలయ కమిటీ చైర్మన్- మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మంచాల జ్ఞానేందర్ గుప్తా తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ మంచాల జ్ఞానేందర్ గుప్తా మాట్లాడుతూ ఆలయ నిర్మాణం కోసం కాశీలోని అమ్మవారికి ఆలయ మట్టిని తీసుకువెళ్లి అభిషేకం చేయించామని పేర్కొన్నారు. కుంభమేళా నుంచి నీటిని తీసుకువచ్చి ఆ పరమశివుడి ఆశీస్సులు ఉండేలా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి కొంతమంది దాతలు చేసిన సేవను మరువలేనని తెలిపారు. కావున జిల్లా ప్రజల ఆశీస్సులతో అమ్మవారి అనుగ్రహంతో వారాహి అమ్మవారి ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.