ఎల్లారెడ్డి రూరల్ : కుంభమేళాకు (Kumbh Mela) వెళ్లిన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన వ్యక్తి అనారోగ్యానికి గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు .. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మాజీ వార్డు మెంబర్ మంగళి శంకర్ ( Shanker) కుంభమేళాలో స్నానం చేయడానికి ప్రయాగ్ రాజ్‌కు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అస్వస్థతకు గురి కాగా ను లక్నో ఆసుపత్రిలో చేర్పించారు.
అనంతరం అతనిని వెంటిలేటర్ అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. గతంలో ఎల్లారెడ్డి గ్రామపంచాయతీ వార్డు సభ్యునిగా పనిచేసిన శంకర్ అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. అతని మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.