సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు.
- రెండున్నరేండ్లయినా పట్టించుకోని ప్రభుత్వం
- వెంటనే వారి డిమాండ్లను నెరవేర్చాలి
- ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి
ఆర్మూర్‌టౌన్, ఏప్రిల్ 24: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్మూర్ పట్టణంలోని డిపో ఆవరణలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు శుక్రవారం సంఘీభావం తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని, చికిత్స పొందుతూ మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడడంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారని తెలిపారు. రెండున్నరేండ్లయినా ఇప్పటివరకు పరిష్కరించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా మద్దతు ప్రకటించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

