ఖలీల్‌వాడి,సెప్టెంబర్: తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్టు అక్రమమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నదని ఆరోపించారు.
తొమ్మిది నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఆగం చేసిందని విమర్శించారు. అప్రకటిత నిర్బంధం కొనసాగుతున్నదని తెలిపారు. దిలీప్‌ను బేషరతుగా విడుదలచేయాలని డిమాండ్ చేశారు.