నిర్బంధించినా.. నిరసనకు తరలిన జాజాల
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నా కామారెడ్డిలో ఉద్రిక్తతకు దారి తీసింది. లింగంపేటలో చేపట్టిన ధర్నాకు వెళ్లకుండా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో పోలీసులు అడ్డుకున్నారు.
- లింగంపేట్‌లో ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
- కామారెడ్డిలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం!
- తప్పించుకొని జాతీయరహదారిపై నిరసన చేపట్టిన సురేందర్
- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ యథావిధిగా కొనసాగించాలని డిమాండ్
కామారెడ్డి, ఆగస్టు 17 : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నా కామారెడ్డిలో ఉద్రిక్తతకు దారి తీసింది. లింగంపేటలో చేపట్టిన ధర్నాకు వెళ్లకుండా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటి నుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్టు చేశారు.
విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు జాజాల ఇంటి వద్దకు చేరుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో జాజాల పోలీసుల నుంచి తప్పించుకొని బీఆర్ఎస్ నాయకులతో కలిసి సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఎదురుగా ఉన్న పాత జాతీయ రహదారి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్లకార్డు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ..బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో లేకపోయినా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. అలాంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
సంక్షేమ పథకాలంటే ఇష్టంలేని కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలురైన వ్యక్తులతో కోర్టులో కేసు వేయించిందని ఆరోపించారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఆరు వారాల పాటు పథకాలను నిలిపివేసిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కోర్టులో కౌంటర్ దాఖలు చేసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

