సంజయ్ తప్పుకోవాలి
బాలికపై వేధింపులకు పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని, బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. బి చ్కుందలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మా ట్లాడారు. కేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని బాధిత కుటుంబం పై బెదిరింపులకు పాల్పడడం దారుణమ ని మండిపడ్డారు.
- ఆయన కుమారుడిని అరెస్టు చేయాలి : మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
బిచ్కుంద, మే11: బాలికపై వేధింపులకు పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని, బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. బి చ్కుందలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మా ట్లాడారు. కేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని బాధిత కుటుంబం పై బెదిరింపులకు పాల్పడడం దారుణమ ని మండిపడ్డారు.
తన కొడుకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడితే బండి సం జయ్ మౌనంగా ఉండడం సిగ్గుచేటని, ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యా యం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తే.. బాధితుల పక్షాన ఉం డాల్సిన పోలీసులు నిర్లక్ష్యం చేయ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిందితుడిపై పోక్సో కేసు చట్టం కింద కేసు నమోదు చేసినా పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేసి, కోర్టులో హాజరు పర్చాల్సి ఉండగా, 48 గంటలు గడుస్తున్నా ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. కేంద్ర హోం శాఖ సహయ మం త్రిగా ఉన్న బండి సంజయ్ ప్రభావం ఈ కేసుపై పడే అవవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నందున, విచారణ నిష్పాక్షపతంగా జరగాలంటే ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలని సూచించా రు.
ఆయన రాజీనామా చేయకపోతే ప్రధాని మోదీ స్పందించి సంజయ్‌ను బర్తరఫ్ చేసి, బాలికకు న్యాయం చేయాలని కోరారు. బాధిత కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతున్న బండి సంజయ్‌ను నిందితుడిగా లిస్టులో చేర్చాలని డిమాండ్ చేశారు. ఒక బాలికపై అ ఘాయిత్యం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండడం శోచనీయమన్నారు. సీఎం, హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

