నిజాంసాగర్, నవంబర్ 17 :మహ్మద్‌నగర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు సాదుల సత్యనారాయణ ఆధ్వర్యంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ముఖ్య అథితిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, సీడీసీ మాజీ చైర్మన్ గంగారెడ్డి, సొసైటీ చైర్మన్ వాజీద్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఇతర గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.