బాన్సువాడ, నవంబర్ 26: కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పోచారం శ్రీనివాసరెడ్డి చెబుతున్నాడని, బీఆర్ఎస్ పార్టీ బీ ఫాంపై గెలిచిన అతడిని గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు నిలదీయాలని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. సమైక్యవాగులకు కొమ్ముకాస్తూ.. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి ప్రజలపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని, అతడి పాలన బాగున్నదని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెబుతున్న పోచారాన్ని ప్రజ లు తిరస్కరించాలన్నారు. బాన్సువాడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశానికి బాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం, ఈ ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని, ఆలాంటి మంచి నాయకుడిని మరోసారి సీఎం చేసుకోలేకపోయామని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన సమయంలో కేసీఆర్ టీడీపీని వీడి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వ్యూ హాలు రచించారని చెప్పారు. అహింసా మార్గంలో తెలంగాణ ఉద్యమం నడిపి రాష్ర్టాన్ని సాధించి పెట్టారని, తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టి దేశంలోనే రాష్ర్టాన్ని నంబర్‌వన్ స్థానంలో నిలిపిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. హిట్లర్ నిరంకుశ పాలనను రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్నాడ ని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో భర్తకు డబుల్ చార్జి, భార్యకు సింగల్ చార్జి అన్న చందంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.
కన్నతల్లిలాంటి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన పోచారానికి సిగ్గు ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారదోలేందుకు పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చా రు. ఇప్పటికే 60సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి.. చిల్లి గవ్వ తేలేదని, రెండేండ్లలో రెండు లక్షల 30వేల కోట్ల రూపాయ ల అప్పు చేశాడని అన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్మును దోపిడి దొంగల్లా దోచుకుతింటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ నేత లు, కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈనెల 29న బాన్సువాడలో నిర్వహించనున్న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ కేవలం అధికారం కోల్పోయిందని, ప్రజల్లో అభిమానం అలాగే ఉన్నదని, త్వరలో జరిగే స్థానిక సంస్థల పోరులో పార్టీ సత్తా చాటాలని బాజిరెడ్డి సూచించారు. మెజార్టీ సీట్లు సాధిస్తే.. కాంగ్రెస్ నాయకులకు కనువిప్పు కలుగుతుందన్నారు. కాం గ్రెస్ నాయకులు ఎక్కడ అవినీతి, అక్రమాలకు పా ల్పడినా.. బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. రూ.50వేలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కష్టపడి పనిచేసే వ్యక్తులను ఎన్నికల్లో గెలిపించాలని సూచించారు. బాన్సువాడ బల్దియా మాజీ వైస్ చై ర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు అంజిరె డ్డి, నాయకులు మోచి గణేశ్, ఎర్రవట్టి సాయిబాబా, బోడ చందర్, గాండ్ల క్రిష్ణ, మహేశ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.