ఖలీల్‌వాడి, డిసెంబర్ 8 : జిల్లాకేంద్రంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో విజయవంతమైందని, ఇలాంటి ఆటోషోలు మరిన్ని నిర్వహించాలని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆటోషోను ఆదివారం సాయంత్రం సందర్శించిన బాజిరెడ్డి.. స్టాళ్లలో ఏర్పాటు చేసిన కార్లు, బైక్‌లను పరిశీలించారు. ఎలక్రిక్టల్ వాహనాలతోపాటు అత్యాధునిక టెక్నాలజీ వాహనాలు సైతం అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు.
అన్ని వాహనాల కంపెనీల వారు ఆటోషోలో స్టాళ్లను ఏర్పాటు చేయడం బాగున్నదని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు అభినందనలు తెలిపారు. నిజామాబాద్‌లో దుబాయి స్థాయిలో ఆటోషో నిర్వహించడం అద్భుతంగా ఉందని ధర్పల్లి మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్మోహన్ అన్నారు. కార్యక్రమంలో సన్‌రైజ్ కియా మేనేజింగ్ డైరెక్టర్ రవికిరణ్గౌడ్, మాజీ జడ్పీటీసీ మహిపాల్‌రెడ్డి, నమస్తేతెలంగాణ బ్రాంచ్‌మేనేజర్ గడ్డి ధర్మరాజు, బ్యూరో ఇన్చార్జి జూపల్లి రమేశ్‌రావు, ఏడీవీటీ మేనేజర్ కె. శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మహిళలకు రూ. 2500తోపాటు స్కూటీ అందించాలని డిమాండ్ చేశారు.