బాన్సువాడ : తిరుమల, తిరుపతి దేవస్థానంగా వెలుగొందుతున్న బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, మాజీ మంత్రి , ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ( Pocharam Srinivas Reddy ) ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థానం పరిధిలో స్వాగత తోరణం ( అలిపిరి ) నుంచి గుట్ట పైన గుడి వరకు కాలి నడకన వచ్చె భక్తుల కోసం నూతన వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు,నాయకులు, భక్తులు పాల్గొన్నారు.