బాల్కొండ : పదో తరగతి (Tenth Class) పరీక్షల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక బృందాలను (Special teams ) ఏర్పాటు చేసినట్లు బాల్కొండ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్, సబ్జెక్టు నిపుణులు ప్రశాంత్ కుమార్, వి శ్రీనివాస్, సాయికుమార్ తదితరులు బుధవారం మండలంలో ఇంటర్నల్ మార్కుల (Internal Marks) పరిశీలన కోసం పాఠశాలలను సందర్శించామని తెలిపారు.
బాల్కొండ మండలంలో రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో టీమ్ కిసాన్ నగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రతి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్ మార్కులను క్షుణ్ణంగా పరిశీలిస్తాయని తెలిపారు.
ఈ పరిశీలన ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడానికి, తద్వారా వారి అభ్యసనానికి మెరుగైన మార్గదర్శకం అందించడానికి వీలుంటుందన్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి గ్రేడింగ్ పద్ధతికి బదులుగా ఫలితాలు మార్కుల రూపంలో ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.