ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ ప్రజలు లేఅవుట్ క్రమబద్దీకరణ పథకాన్ని(LRS) సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు( Commissinor Raju) కోరారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్ (LRS) ను సద్వినియోగం చేసుకొని 25శాతం రాయితీ పొందాలని, ఈ అవకాశం మార్చి 31 వరకు మాత్రమే ఉందని అన్నారు.
2020 సంవత్సరంలో వెయ్యి రూపాయలు రుసుము చెల్లించి ఎల్ఆర్ఎస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ ల యజమానులు అనుమతిలేని లేఅవుట్లలోని ఖాళీ ప్లాట్ లను రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం 2025 మార్చి 31 తేదీ వరకు అవకాశం కల్పించిందని కమిషనర్ తెలిపారు. అనుమతి లేని లేఔట్లలో 10 శాతం ప్లాట్ల రిజిస్ట్రేషనై , మిగతా కానీ వాటిని కూడా సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తో పాటు ఎల్ఆర్ఎస్ రుసుము కూడా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు.