కంఠేశ్వర్, ఏప్రిల్ 3: లోక్‌సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఈవీఎంల మొదటి విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియ బుధవారం పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు కేటాయించాల్సిన ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ గురించి కలెక్టర్ వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల నిబంధనలను పాటిస్తూ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, అధికారులు పాల్గొన్నారు.