మాక్లూర్, మార్చి 27: మండలంలోని చిన్నాపూర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు దావానలం వ్యాపించినట్లు గోశాలలో ఉన్న స్థానికులు తెలిపారు.
వెంటనే పారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా, వారు ఫైరింజన్లు, డ్రోన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో మంటలు చెలరేగాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు.