మోర్తాడ్/భీమ్‌గల్/ఆర్మూర్/కోటగిరి, జూలై 29 : మోర్తాడ్ మండలంలో జ్వరసర్వే కొనసాగుతుంది. దొన్కల్ గ్రామంలో శుక్రవారం ఇంటింటికీ ఆరోగ్యసిబ్బంది తిరుగుతూ కుటుంబ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. భీమ్‌గల్ మండలంలోని అన్ని గ్రామాల్లో జ్వర సర్వే కొనసాగుతుందని ఎంపీడీవో రాజేశ్వర్ తెలిపారు. బెజ్జొరా, లింగాపూర్, పల్లికొండ గ్రామాల్లో కొనసాగుతున్న జ్వర సర్వేను ఆయన పరిశీలించారు. బూస్టర్ డోస్ తీసుకోని వారుంటే వెంటనే తీసుకోవాల న్నారు. ఎంపీడీవో వెంట సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వైద్యసిబ్బంది తదితరులున్నారు.
ఆర్మూర్‌లో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్ పలు వార్డుల్లో పర్యటించి జ్వర సర్వే జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, డీఈ భూమేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్, మెప్మా సీఈవో ఉదయశ్రీ, ఆరోగ్యశాఖ అధికారులు సాయన్న, జక్కుల మోహన్, గణేశ్, రాణి, టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షురాలు అల్లూరి తార, మెప్మా సీఏలు మేఘన, వర్ష, లలిత, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలంలోని ఎక్లాస్‌పూర్‌లో అంగన్వాడీ టీచర్ జయమణి, పంచాయతీ కార్యదర్శి స్వాతి శుక్రవారం ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.