PACS RUDRURU | రుద్రూర్ : మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం 80వ మహాజన సభను విండో అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. కార్యదర్శి లక్ష్మణ్ ఏప్రిల్ 2024 నుండి సెప్టెంబర్ 2024 కు సంబందించిన జమ ఖర్చులు జాబితాను సభలో చదివారు. రైతు రుణ మాఫీ వర్తించలేదని కొంత మంది ఖాతా దారులు ప్రశ్నించగా త్వరలో వస్తుందని కార్యదర్శి సమాధానమిచ్చారు. కొంత మందికే ఎరువులు ఇచ్చారని, రైతులు ప్రశ్నిస్తే అడ్వాన్స్ ఇచ్చిన రైతులకు ముందుగా ఎరువులు పంపిణీ చేశామని బదులు ఇవ్వడంతో రైతులు ఆగ్రహించారు. ఈ సారి కొనుగోలు కేంద్రాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రైతుల వినతి మేరకు అధ్యక్షులు ఏకీభవించారు.
ఆరు నెలలకోసారి నిర్వహించే ఈ సభకు విండో కార్యవర్గం అందరు హాజరు కావాలని సూచించారు. సుమారు 300 మంది రైతులలో కేవలం 78మందికే రుణమాఫీ రావడం ఏంటని ఆగ్రహించారు. కొనుగోలు కేంద్రానికి ప్రాథమిక సహకార సంఘంలో ధాన్యం విక్రయించిన రైతుల జాబితాను గూర్చి అడగగా ఆ జాబితా తమ వద్ద ఉండదని సమాధానం ఇచ్చిన కార్యదర్శి తీరుఫై రైతులంతా ఆగ్రహించారు. అనంతరం కొనుగోలు కేంద్రం ప్రారంభం తీర్మాణం చేసి ముగించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శంకర్, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారం, డైరెక్టర్లు గుర్ల గోపి, కార్కే అశోక్, గజేందర్, శుభాని, ఏఎంసీ డైరెక్టర్ పార్వతి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.