కామారెడ్డి : జిల్లాలోని సదాశివనగర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident ) తండ్రి మృతి చెందగా కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కుకునూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి నిన్న రాత్రి హైదరాబాద్కు చేరుకున్నాడు. అతడి కూతురు లహరి హాస్టల్ ఉంటూ చదువుకుంటుంది.
ఇద్దరు కలిసి స్వగ్రామానికి రాత్రి కారులో బయలుదేరారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ( Sadashivanagar) మండలం గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై (National Highway) వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి లోనై లారీకి బస్సుకు మధ్య ఇరుక్కుపోయింది.
ఈ ప్రమాదంలో గంగాధర్ (45) ఆక్కడికక్కడే మృతి, చెందగా లహరి (17) కు తీవ్ర గాయాలు. ఆమెకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. గంగాధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.